ప్రభాస్ విలన్ తో బెల్లంకొండ శ్రీనివాస్ !
Published on Mar 13, 2018 1:10 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్ నూతన దర్శకుడు శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యింది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో నీల్ నితిస్ ముకేష్ ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈయన ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’లో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

గతంలో నీల్ నితీస్ ముకేష్ విజయ్ ‘కత్తి’ సినిమాలో విలన్ గా నటించాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు రావడం వల్ల ప్రభాస్ సినిమా అవకాశం దక్కింది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాతో పాటు ముకేష్ మరో రెండు తెలుగు ప్రాజెక్ట్స్ చెయ్యబోతున్నాడు. చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్స్ త్వరలో ఫైనల్ కానున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘సాక్ష్యం’ ఈ ఏడాది మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook