తనకి ఇష్టమైన హీరోయిన్లు ఎవ్వరో చెప్పిన ప్రభాస్ !

తనకి ఇష్టమైన హీరోయిన్లు ఎవ్వరో చెప్పిన ప్రభాస్ !

Published on Jun 21, 2018 2:49 AM IST


యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ ‘బాహుబ‌లి’ చిత్రంతో నేషనల్ స్టార్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్ర‌భాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌భాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌భాస్ జాతీయ మీడియాతో సాహో చిత్రం గురించ్గి మాట్లాడుతూ.. సాహోలో శ్ర‌ద్ధా క‌పూర్ పాత్ర చాలా కీలకం అని సాహో కథను నడిపించే ముఖ్య పాత్ర శ్ర‌ద్ధాదేనని చెప్పుకొచ్చారు.

అలాగే సాహో చిత్రంలో 11 కీల‌క‌పాత్ర‌లు ఉన్నాయని సాహో చిత్రం అంద‌రికీ న‌చ్చుతుందని అన్నారు. అయితే ప్రభాస్ బాలీవుడ్ లో తనకు నచ్చిన సినిమాలు, హీరోయిన్ల గురించి కూడా చెప్పారు. సినిమాల విషయానికి వస్తే `షోలే` `ద‌బాంగ్` చిత్రాలు తనకెంతో ఇష్టమన్నారు అదేవిధంగా హీరోయిన్ల‌లో తనకి దీపికా ప‌దుకునే, అలియా భ‌ట్, క‌త్రినా కైఫ్‌ అంటే ఇష్టమన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు