ఈ టాలెంటెడ్ దర్శకుడితో ప్రభాస్.?

Published on Apr 4, 2021 12:00 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ఇప్పటికి అయితే మొత్తం నాలుగు భారీ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండగా వాటిలో రాధే శ్యామ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిపోయింది. ఇక మిగిలి ఉన్న మూడు చిత్రాలు అనంతరం కూడా సాలిడ్ ప్లాన్స్ ఉన్నాయని టాక్ ఉంది.

అయితే మరి ఈ లైనప్ లో బాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిద్దార్థ్ ఆనంద్, ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రం “సలార్” దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఇంకో సినిమా ఉందని తెలిసింది. మరి ఇప్పుడు కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు పేరు లైన్ లోకి వచ్చింది.

అతడే లేటెస్ట్ ‘మాస్టర్’ సెన్సేషన్ లోకేష్ కనగ్ రాజ్. తెలుగులో లాస్ట్ రెండు చిత్రాలు “ఖైదీ” మరియు “మాస్టర్” సినిమాలతో మంచి గుర్తింపు తెచుకున్నాడు. మరి దర్శకుడు పేరు కూడా లైన్ లోకి వచ్చిందని గాసిప్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతమేర నిజముందో చూడాలి.

సంబంధిత సమాచారం :