బాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రభాస్ “ఆదిపురుష్” టీజర్!

Published on Oct 3, 2022 3:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ నిన్న రాత్రి అయోధ్యలో విడుదలైంది. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, టీజర్ బాలీవుడ్‌లో కొత్త రికార్డులను సృష్టించింది. ఆదిపురుష్ హిందీ టీజర్ అత్యధిక లైక్‌లు పొందిన టీజర్‌గా మారడానికి కేవలం 16 గంటల సమయం పట్టింది. టీజర్ కి 933K కంటే ఎక్కువ లైక్‌లు రాగా, 56 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. దీనితో, ఆదిపురుష్ హిందీ టీజర్ ఇప్పటివరకు అత్యధిక లైక్‌లు మరియు వీక్షించిన హిందీ టీజర్‌గా నిలిచింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక డ్రామా లో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ మరియు ఇతర ప్రముఖ పాత్రలు కూడా ఉన్నాయి. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జనవరి 12, 2023 న అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :