‘సలార్’లో ప్రభాస్ రోల్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

‘సలార్’లో ప్రభాస్ రోల్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Jun 20, 2021 5:02 AM IST

యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ – నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమా “సలార్”. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ కోసం రెడీ అయింది. ఇప్పుడు, ఈ చిత్రం గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే.. ఈ చిత్రంలో ప్రభాస్‌ ను డ్యూయెల్ రోల్స్ లో కనిపిస్తాడని.. క్లైమాక్స్ లో ట్విన్స్ అని రివీల్ అవుతుందని ఇది చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం మరో హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు