‘జాన్’ ప్లాష్ బ్యాక్ లో ప్రభాస్ లుక్ హైలైట్ అట !

Published on Mar 3, 2020 7:01 am IST

నేషనల్ స్టార్ ప్రభాస్ ‘జాన్’ షూటింగ్ ఇప్ఫటికే రెండు మూడు సార్లు పోస్ట్ ఫోన్ అవుతూ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కాగా ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే స్పెషల్ సెట్ లో షూటింగ్ జరిపారు. అయితే ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా వన్ వీక్ షూటింగ్ జరగనుంది. కాగా `జిల్` సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ చాల కొత్తగా కనిపించనున్నాడు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లో ప్రభాస్ లుక్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతుందట.

ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నాలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివ‌ర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రానికి టైటిల్ ‘జాన్’ ప్రచారంలో ఉంది. మరి ఇదే టైటిల్ పెడతారా లేక మారుస్తారా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :

More