పీరియాడిక్‌ ఎంటర్టైనర్ లో ప్రభాస్ రోల్ అదేనట !

Published on Dec 22, 2018 4:29 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్ తో `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నది.

కాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రాధాకృష్ణ ట్విట్టర్ వేదికగా రీవీల్ చేశారు. ఈ సినిమా ఓ ప్రేమకథ అట. పైగా 1960 కాలంలో ఈ కథ సాగుతుందట, అయితే ప్రభాస్ వింటేజ్ కార్లను కొనుగోలు చేసే ధనికుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. సినిమాలో వింటేజ్ కార్లకు ప్రభాస్ కు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయని దర్శకుడు చెబుతున్నాడు.

మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2019 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :