‘గోవిందుడు అందరివాడేలే’ని హిందీలోకి తీసుకెళ్లనున్న ప్రభుదేవా?

Prabhu-Deva12
కృష్ణవంశీ, రామ్ చరణ్ ల కలయికలో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను బాలీవుడ్ కి తీసుకెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు సినిమాలను హిందీలోకి రీమేక్ చేసి హిట్లు కొడుతున్న డ్యాన్సర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా ఈ సినిమా పై మనసుపారేసుకున్నాడని సమాచారం. ముఖ్యంగా ప్రభుదేవాకి ప్రకాష్ రాజ్ నటన చాలా నచ్చినట్టు తానే హిందీలో సినిమా తీస్తే ఆ పాత్రకు తిరిగి ప్రకాష్ రాజ్ నే ఎంపిక చేస్తానని తెలిపినట్టు సమాచారం.

ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ “ప్రభు నాకు మంచి స్నేహితుడు.గోవిందుడు అందరివాడేలే సినిమా తనకి ప్రత్యేక షో వేసి చూపించామని, సినిమా ఆద్యంతం అతనికి బాగా నచ్చిందని, ప్రస్తుతానికి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేనని తెలిపాడు.” ప్రభుదేవ పోకిరి, విక్రమార్కుడు సినిమాలను రీమేక్ చేసి ఘనవిజయం సాధించిన విషయం తెలిసినదే

Exit mobile version