ప్రభుదేవా డైరెక్షన్ లో కమల్ హాసన్.?

ప్రభుదేవా డైరెక్షన్ లో కమల్ హాసన్.?

Published on Mar 1, 2015 7:34 PM IST

Prabhu-Deva-to-direct-Kamal
ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు నిజమైతే ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవా తన తదుపరి సినిమాలో ఉలగ నాయగన్ కమల్ హాసన్ ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్ర్రముఖ ప్రొడక్షన్ వాసన్ విజువల్ వెంచర్స్ వారు ప్రస్తుతం వీరిద్దరితో చర్చలు జరుగుతున్నాయి. కమల్ హాసన్ స్క్రిప్ట్ ఓకే చెయ్యగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. గతంలో కూడా ప్రభుదేవా కమల్ హాసన్ తో పనిచెయ్యాలని ఉందని తెలియజేశాడు.

గతంలో సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్ లో ‘నవ్వండి లవ్వండి’ సినిమాలో కమల్ హాసన్ – ప్రభుదేవా కలిసి నటించారు. విజన్ విజువల్ వెంచర్స్ వారు గతంలో తమిళ హీరో ఆర్యతో ‘నేను దేవుణ్ణి’, ‘నేనే అంబాని’ సినిమాలు చేసారు. ప్రభుదేవా చివరి సినిమా ‘యాక్షన్ జాక్సన్’ సినిమా ఫ్లాప్ అయ్యింది. కమల్ హాసన్ ప్రస్తుతం ఉత్తమ విలన్, విశ్వరూపం 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు