“అరణ్య” లాంటి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది – దర్శకుడు ప్రభు

Published on Mar 23, 2021 8:00 am IST

సినిమా ప్రపంచంలో ఎన్నో జానర్స్ ఉంటాయి. అయితే వాటిలో అతి తక్కువ టైంలో కనెక్ట్ అయ్యేది కాస్త సున్నితమైన బ్యాక్ డ్రాప్ ఉన్నవే అని చెప్పాలి. అలాంటి వాటిలో ఖచ్చితంగా జంతువులకు మనుషులకు మధ్య ఉన్న సినిమాలు అయితే మరింత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. మరి అలాంటి సినిమాను టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటితో తీసుకున్న దర్శకుడు ప్రభు సాల్మోన్.

ఏనుగులకు మనిషికి మధ్య బ్యాక్ డ్రాప్ తో “అరణ్య” అనే ఒక నిజ జీవిత సంఘటనల ఆధారిత సినిమాను తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా చాలా రీసెర్చ్ చేసారని మొత్తం 20 ఏనుగులను ట్రైనింగ్ ఇచ్చి సినిమా చెయ్యడం చాలా కష్టంగా అనిపించిందని తెలిపారు.

అంతే కాకుండా ఇలాంటి సినిమాకు రానా అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటారని తీసుకోవడం జరిగిందని అలాగే ఇలాంటి సినిమా ఇండియన్ సినిమాలో వచ్చే చాలా కాలం అయ్యిందని ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఒక మనిషికి ఒక ఇనోసెంట్ వన్య మృగానికి మధ్య సినిమా వచ్చి చాలా కాలం అయ్యిందని..

మన దేశంలో అలాంటి ప్రాణులను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు? దానికి సంబంధించిన సీరియస్ నెస్ ను సామాజిక బాధ్యతగా తెరకెక్కించినందుకు నేను గర్వపడుతున్నాని తాను తెలిపారు. పాన్ ఇండియన్ లెవెల్లో ఈ చిత్రం వచ్చే మార్చ్ 26న విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :