ఇంటర్వ్యూ : ప్రభుదేవా – ‘లక్ష్మి’ ఒక అమ్మాయి కథ!

Published on Aug 21, 2018 5:56 pm IST

ప్రముఖ డాన్స్ మాస్టర్, డైరెక్టర్ ప్రభుదేవా నటించిన తాజా చిత్రం లక్ష్మి. తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా అదే టైటిల్ తో ఆగస్టు 24న విడుదల కానుంది. ఈ సంధర్బంగా ప్రభుదేవా మీడియా తో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం ..

ఈ చిత్రం దేని గురించి ఉండనుంది ?

ఇది గురు శిష్యుల మధ్య జరిగే కథ . డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ అద్భుతంగా తెరక్కించాడు. ఆయన కెరీర్ లోనే బెస్ట్ పిక్చర్ అవుతుంది.

ఈచిత్రంలో స్పెషల్ ఏంటి ?

ఒక మూడున్నర నిమిషాలు పాట లేకుండా, మ్యూజిక్ లేకుండా డ్యాన్స్ చేశాం. ఇప్పటివరకు ఆలా ఎవరు చేయలేదు. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రానికి మీరే కొరియోగ్రఫీ చేశారా ?

లేదు నేను చేయలేదు. పరేష్ మరియు రుయల్ అనే ఇద్దరు డాన్స్ మాస్టర్లు చేశారు. ఇండియా లెవల్లో ఉండాలి అని చెప్పా సింపుల్ మూమెంట్స్ ను ఇంకా కొంచెం కష్టం గా వుండే మూమెంట్స్ ని చేయండి అని మాత్రమే చెప్పా.

ఈ చిత్రానికిలక్ష్మి అనే టైటిల్ పెట్టడానికి గల కారణం ?

ఆ టైటిల్ నేనే పెట్టమని చెప్పాను ఎందుకంటే లక్ష్మి అనే టైటిల్ ఈచిత్రానికి సరిగ్గా సరిపోతుంది. చిత్రం చూశాక అందరు ఇదే ఫీల్ అవుతారు.

ప్రేమికుడు సినిమాకి సీక్వెల్ ఉంటుందా ?

లేదు ఇప్పుడు చాలా కష్టం.

ప్రస్తుతం ఎన్ని చిత్రాలలో నటిస్తున్నారు ?

ప్రెసెంట్ పోలీస్ స్టోరీ కథ నేపథ్యంలో ఒక సినిమా లో అలాగే 1983లో కుంగ్ ఫు నేపథ్య కథ తో మరో చిత్రంలో సీరియల్ కిల్లర్ కథ నేపథ్యంలో సాగె సినిమాతో పాటు అభినేత్రి 2 చిత్రంలో కూడా నటిస్తున్నాను.

వేరే వారి సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తునారా ?

చాలా తక్కువ. ప్రస్తుతం ధనుష్ మారి 2చిత్రంలో రెండు సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేశాను.

తెలుగు లో రీసెంట్గా ఎన్ని సినిమాలు చూశారు ?

ఎక్కడికిపోతావు చిన్నవాడా, భరత్ అనే నేను, రంగస్థలం సినిమాలు చూశాను. అన్ని బాగున్నాయి. రంగస్థలం బాగా నచ్చింది.

సంబంధిత సమాచారం :

X
More