కోలీవుడ్ వరుస విజయ చిత్రాలు హీరో ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్ కి తన తాజా సినిమా ఎల్ ఐ కే సినిమా బ్రేక్ వేసింది అని అందరికీ తెలిసిందే. దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ ఫ్యూచర్ లవ్ స్టోరీ డ్రామా మొదటి రోజునే డిజప్పాయింటింగ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా మొదటి వారం రన్ ని పూర్తి చేసుకోగా ఈ మొదటి వారానికి ఏకంగా 50 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
మొదటి వారానికే 54.3 కోట్ల గ్రాస్ ఈ సినిమాకి వచ్చినట్టు మేకర్స్ రివీల్ చేయగా ఈ నెంబర్ నమ్మశక్యంగా లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొదటి రోజునే తెలుగు ఆడియెన్స్ రిజెక్ట్ చేసేసారు. తమిళ నాట కూడా దాదాపు అంతే కానీ కొంచెం పర్వాలేదు అనిపించింది. అయినప్పటికీ సినిమా మొదటి వారానికి 54 కోట్లు రాబట్టింది అంటే ఒకింత డౌట్స్ రాక మానవు. మరి మేకర్స్ జస్ట్ పబ్లిసిటీ కోసం వేశారని ఇంకొందరు ఫేక్ వసూళ్లు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.


