అట్లీతో ఈ హీరో కాంబో లోడింగ్ అవుతుందా..?

అట్లీతో ఈ హీరో కాంబో లోడింగ్ అవుతుందా..?

Published on Jun 7, 2026 1:04 AM IST

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ, ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘రాకా’ అనే భారీ పాన్-ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే, తాజాగా తమిళ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అట్లీ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో క్రేజీ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్‌లో నటించనున్నాడట.

‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో ట్రెండ్ సెట్ చేసిన ప్రదీప్ రంగనాథన్‌కు ప్రస్తుతం ఇండస్ట్రీలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రేజ్‌తో ఆయన తన రెమ్యూనరేషన్‌ను కూడా భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నటుడిగా వరుస ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెట్టడమే కాకుండా, త్వరలోనే మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు కూడా ప్రదీప్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆయన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యాడు.

ఇక అట్లీ నిర్మాణంలో రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు అట్లీ శిష్యుడు దర్శకత్వం వహించనున్నాడు. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ముగిశాయని, వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. త్వరలోనే అట్లీ-ప్రదీప్ రంగనాథన్ కాంబినేషన్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

తాజా వార్తలు