తమిళ నటుడు కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించే సినిమాల్లో యూట్‌ను ఆకట్టుకునే అంశాలు ఉంటాయని ప్రేక్షకులు భావిస్తారు. ఈ క్రమంలోనే ఆయన వరుసగా చిత్రాలను చేస్తున్నాడు. రీసెంట్‌గా ‘డ్రాగన్’ మూవీతో ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తిశ్వరణ్ అనే కొత్త డైరెక్టర్‌తో ప్రదీప్ రంగనాథన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘డ్యూడ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక దీనికి సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.