‘తెలుగు డైరెక్టర్’ హిందీ సినిమా విడుదలకు రెడీ !

Published on Apr 20, 2019 2:00 am IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ మొదట హీరోగానే సినీ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత సినిమాలకి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ప్రకాష్ ‘మెంటల్ హై క్యా’ అనే ఓ హిందీ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

కాగా ‘మెంటల్ హై క్యా’లో కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావులు ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 21 విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :