వైరల్ అవుతున్న ప్రకాష్ రాజ్ మళ్ళీ పెళ్లి.!

Published on Aug 25, 2021 3:06 pm IST

ఒక్క మన తెలుగులోనే కాకుండా మొత్తం సౌత్ లో కూడా మంచి విలక్షణ నటుల జాబితా తీస్తే ఖచ్చితంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా ఉంటుంది. మొత్తం దేశ వ్యాప్తంగా కూడ ప్రకాష్ రాజ్ ఎన్నో చిత్రాల్లో నటించారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ పేరు మరియు తన మళ్ళీ పెళ్లి ఫోటోలు కాస్తా అనూహ్యంగా వైరల్ అవుతున్నాయి.

తన భార్య పోనీ ప్రకాష్ రాజ్ తో తమ వైవాహిక జీవితం నిన్నటితో 11 ఏళ్ళు పూర్తి చేసుకొనే సరికి తన ఇంట్లోనే మళ్ళీ ఆనందాన్ని పెళ్లి చేసుకొని సెలెబ్రేట్ చేసుకోవడంతో ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఆ హ్యాపీ మూమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ప్రస్తుతం ప్రకాష్ రాజ్ నటించిన “కేజీయఫ్ 2”, “మేజర్” లాంటి భారీ పాన్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉండగా మరిన్ని చిత్రాల్లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :