టైగర్ శ్రోఫ్, కృతి సనన్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్న హీరోపంతి సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి డబ్ చెప్పే పని లో ప్రకాష్ రాజ్ బిజీగా ఉన్నారు. తెలుగులో వచ్చిన పరుగు చిత్రాన్ని కొద్దిపాటి మార్పులతో హిందీ లో రిమేక్ చేస్తున్నారు. పరుగులో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, హీరోపంతిలో కూడా ప్రకాష్ రాజ్ అదే పాత్రలో, కృతి సనన్ తండ్రిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్, శబ్దాలయ లో జరుగుతున్న డబ్బింగ్ లో ఆయన గత కొద్ది రోజులుగా పాల్గొంటున్నారు. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లతో ఆయన తప్పుగా ప్రవర్తించారని వార్తలు వస్తున్నాయి. అనుచిత ప్రవర్తన కారణంగా ఆయనపై ఓ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయ్యింది.
అంతేకాకుండా, ఉలవచారు బిర్యానీ చిత్రం కోసం ప్రకాష్ రాజ్ ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో నటించడమే కాకుండా ఈ చిత్రానికి అతనే స్క్రిప్ట్ ను రాసి, డైరెక్ట్ చేశారు. స్నేహ, తేజ, సంయుక్త లు ఈ చిత్రంలో సహా నటులుగా నటించారు.


