‘పవన్’ సెట్ కి ఉదయం ఏడున్నరకే వచ్చారట !

Published on Apr 13, 2021 9:07 am IST

‘వకీల్ సాబ్’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అపోజిట్ లాయర్ గా గట్టి పోటీ ఇచ్చారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. పవన్ – ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే కోర్టు సీన్స్ చాల బాగా పేలాయి. మొత్తానికి లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించి.. ఆ పాత్రకు బలం చేకూర్చారు. కాగా వకీల్‌ సాబ్‌ చిత్రంలోని తన పాత్ర గురించి తెలియజేస్తూ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు నేను పవన్‌ కల్యాణ్‌గారు కలిసి నటించిన ‘బద్రి’ సినిమాలో నందా పాత్ర అలా వారికి బాగా గుర్తుండిపోయింది.

అయితే వకీల్ సాబ్‌లో నా పాత్రకు నందగోపాల్ అని పెట్టగానే ప్రేక్షకులు బద్రి టైమ్‌కు వెళ్లిపోయి కనెక్ట్ అయ్యారు. ఇక సినిమాలో పవన్ గారు నందాజీ, నంద గోపాల్ అని పవన్ గారు నన్ను పిలిచినప్పుడు ఆడియెన్స్ ఎంజాయ్ చేశారు. దర్శకుడు అందుకే ఆ పేరు పెట్టారు. వకీల్ సాబ్ సెట్‌కు వెళ్తే.. కోర్టుకు వెళ్ళినట్టే అనిపించేది. ఒక రోజు నేను 9 గంటలకు సెట్‌కు వెళ్తే, పవన్ గారు ఉదయం ఏడున్నర గంటలకే వచ్చారు. పవన్ గారిని అడిగితే నాకు నిద్రపట్టలేదు వచ్చేశాను అన్నారు. ఆయన ఈ సినిమా కోసం అంత కష్ట పడ్డారు. ఆయనతో నటించడం సంతోషంగా ఉంది అంటూ ప్రకాష్ రాజ్ పవన్ తో యాక్ట్ చేయడం గురించి చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :