కావేరీ జలాల నిరసనకారులకు నటుడు ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి

prakash-raj
ప్రస్తుతం కర్ణాటక – తమిళనాడు రాష్ట్రాల్లో కావేరీ జలాల వివాదం తారా స్థాయిలో హింసాత్మకంగా మారింది. కర్ణాటకలో ఉన్న తమిళుల ఆస్తులను, తమిళనాడులో ఉన్న కన్నడిగుల ఆస్తులను నిరసనకారులు తగులబెడుతూ విధ్వంసాలు సృష్టిస్తున్నారు. దీనిపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఆయన మాట్లాడుతూ ‘కర్ణాటక, తమిళనాడుల్లో జరుగుతున్నది చూస్తుంటే భాధగా ఉంది. మన హక్కుల కోసం మనం పోరాడాలి, న్యాయం సాదించాలి. కానీ అది బస్సులను తగలబెట్టి, అన్నదమ్ములను కొట్టి కాదు’ అన్నారు.

అలాగే ‘ఉద్యమం ఎలా చేయాలో మన భవిష్యత్ తరాలకు మనమే నేర్పించాలి. మనకు కోర్టులున్నాయ్, నాయకులున్నారు, చట్టముంది. మనమంతా మనుషులం. శాంతిగా పోరాడుదాం. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మనల్ని మనం నాశనం చేసుకోకూడదు. శాంతిగా ఉండండి, విధ్వసం ఆపండి’ అంటూ నిరసనకారులకు విధ్వంసానికి పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version