రవితేజ -రమేష్ వర్మ సినిమాలో ప్రణీత ?

Published on Nov 29, 2020 11:12 pm IST

రవితేజ తన తరువాత సినిమాని రమేష్ వర్మ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయింది. త్వరలోనే షూటింగ్ కి కూడా సిద్ధం అవుతుంది. అయితే, ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అని, అందుకే ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట, ఈ సాంగ్ కోసం ప్రణీత సుభాష్ ను అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓ తమిళ్ సినిమా ఆధారంగా రాబోతుందని సమాచారం.

కాగా ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారని వార్తలు అయితే వస్తున్నాయి గాని, ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. ఏమైనా రవితేజ ‘డిస్కో రాజా’తో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. మరి క్రాక్ సినిమాతోనైనా అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More