అనాధ బాలల కోసం ప్రణీత ఏం చేశారంటే !

అనాధ బాలల కోసం ప్రణీత ఏం చేశారంటే !

Published on Jun 3, 2018 12:38 PM IST

అనాధ బాలలకు చేయూత నివ్వాలని సినీ నటి ప్రణీత కోరారు. రంజాన్ మాసం సందర్బంగా హైదరాబాద్ లోని కాచిగూడ బిగ్ బజార్ లో అనాధ బాలల కోసం ఏర్పాటు చేసిన ‘నెక్ విత్ బిగ్ బజార్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనాధ బాలల కోసం కృషి చేస్తున్న స్వచ్చంధ సంస్థలు ప్రత్యుష,స్ఫూర్తి ఫౌండేషన్ కు సహాయం అందిస్తున్న ఫ్యూచర్ గ్రూప్ ని ప్రశంసించారు.

తరువాత ఆమె అనాధ బాలల సహాయార్థం తన వంతుగా తిను బండారాలతో పట్టు పలు రకాల వస్తు సామగ్రిని కొనుగోలు చేసి నిర్వహులకు అందజేశారు.ఈ సందర్బంగా ప్రజలు కూడా ముందుకొచ్చి సహాయం చేయాలనీ పిలుపునిచ్చారు.ఇక ప్రస్తుతం ప్రణీత తెలుగులో రామ్ నటిస్తున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు