ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ అంటున్న ప్రణీత

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ అంటున్న ప్రణీత

Published on May 14, 2020 10:41 AM IST

pranitha subhash

ఎన్టీఆర్ ఫ్యాన్స్ లాక్డౌన్ కారణం ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న పేదలకు సాయం చేస్తున్నారు. తాడిపత్రి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పేదలకు, నిరాశ్రయులకు ఆహారం అందించారు. లాక్ డౌన్ మొదలైన నాటి నుండి గత నెల రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు నంద్యాల ప్రాంతంలో పేదలకు ఈ విధంగా సహాయం చేస్తున్నారు. కాగా హీరోయిన్ ప్రణీత సుభాష్ సదరు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులను సూపర్ అని మెచ్చుకున్నారు. తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రణీత ఈ విధంగా స్పందించారు.

లాక్ డౌన్ సమయంలో హీరోయిన్ ప్రణీత సేవా కార్యక్రమాలు అందరిని ముగ్దుల్ని చేస్తున్నాయి. ఆమె అనేక మంది పేదలకు రోజు ఆహారం సరఫరా చేస్తున్నారు. తను సేవ చేస్తూ ఇతరుల సేవను కూడా ఆమె ఈ విధంగా ప్రోత్సహిస్తుంది. ఇక గతంలో రామయ్య వస్తావయ్యా సినిమాలో ప్రణీత ఎన్టీఆర్ కి జంటగా నటించింది. త్వరలో ఈమె బాలీవుడ్ లో కూడా ఎంటర్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు