హిందీలో కి ఎంట్రీ ఇస్తున్న బెంగుళూరు బ్యూటీ !

Published on Apr 7, 2019 9:28 am IST

గత ఏడాది హలో గురు ప్రేమ కోసమే, చిత్రం తో తెలుగు ప్రేక్షకులముందుకు వచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్ తరువాతి మరో ఆఫర్ ను రాబట్టుకోలేకపోయింది. అయితే తాజాగా హిందీలో నటించే ఆఫర్ కోట్టేసింది ఈ బ్యూటీ.

అందులో భాగంగా భుజ్ ది ప్రైడ్ అఫ్ ఇండియా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈచిత్రంలో అజయ్ దేవగన్ , రానా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. 1971 ఇండియా – పాకిస్థాన్ వార్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనుంది ఈ చిత్రం. త్వరలోనే ఈ చిత్రం గురించి మరింత సమాచారం వెలుబడనుంది.

సంబంధిత సమాచారం :