తల్లి కాబోతున్న అందాల తార.. ఫోటో వైరల్ !

Published on Apr 11, 2022 12:14 pm IST

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఏ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్ కాలేకపోయిన ఈ కన్నడ భామ నితిన్ రాజు అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రణీత పెళ్లి ఫోటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా.

మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ప్రణీత.. ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ ను రివీల్ చేసింది. తాజాగా త‌న ప్రగ్నెన్సీ విష‌యం గురించి తెలియజేస్తూ త‌న భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ‘నా భర్త 34వ పుట్టినరోజు సందర్భంగా, పైన ఉన్న దేవదూతలు మాకు ఒక బహుమతిని ఇచ్చారు’ అని అసలు విషయాన్ని చాలా స్వీట్ గా రివీల్ చేసింది.

ప్రస్తుతం ప్రణీత పోస్ట్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ఫొటోలో త‌న టెస్ట్ చేసుకున్న కిట్ కూడా చూపించింది ప్రణీత.

సంబంధిత సమాచారం :