పెళ్లి చేసేసుకుని సారీ చెప్పిన ప్రణీత సుభాష్

Published on May 31, 2021 9:05 pm IST

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ పెళ్లి చేసేసుకుంది. ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా ప్రణీత వివాహం జరిగిపోయింది. ఎవరో ఆమె సన్నిహితులు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేవరకు ఆమె వివాహం సంగతి బయటకు రాలేదు. తీరా సోషల్ మీడియాలో విషయం వైరల్ అయ్యేసరికి ప్రణీత రెస్పాండ్ అయింది. పెళ్లి చేసుకోవడానికి పోలీసులను అనుమతులు కోరగా వారు పెళ్లి తేదీకి ఒక్కరోజు ముందే అనుమతులు ఇచ్చారని, హడావుడిలో పెళ్లి జరిగిపోయిందని అందుకే ఎవ్వరినీ వివాహానికి ఆహ్వానించలేకపోయానని అంది.

అంతేకాదు పెళ్లి సంగతి చెప్పనందుకు క్షమాపణలు కోరి అందరి ఆశీస్సులు తనకు కావాలని, అన్ని పరిస్థితులు సర్దుకున్నాక అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పుకొచ్చింది. ఇక ప్రణీత వివాహం చేసుకున్నది వ్యాపారవేత్త అయిన నితిన్ రాజ్ ను. వీరి వివాహాం కేవలం అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగింది. ఇకపోతే తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం’ లాంటి సినిమాల్లో నటించిన ప్రణీత ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. లాక్ డౌన్ సమయంలో తనవంతుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందింది ప్రణీత.

సంబంధిత సమాచారం :