వాళ్ళతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తాడట !

వాళ్ళతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తాడట !

Published on Feb 3, 2019 8:16 PM IST

kalki

మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ప్రస్తుతం ‘గరుడ వేగ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ తో ‘కల్కి’ అనే చిత్రం తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా కల్కి చిత్రబృందం ప్రెస్ మీట్ ని నిర్వహించింది

ఈ సందర్బంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. బయట రాజశేఖర్ గారి పై కొంత నెగిటివ్ ప్రచారం ఉంది. ఆ ప్రచారంలో అస్సలు నిజం కాదు. రాజశేఖర్ ఫ్యామిలీ చాలా స్వీట్ ఫ్యామిలీ. ఈ సినిమా అనుకున్నదానికి కంటే బాగా రావడానికి వాళ్ళు చేసిన సపోర్ట్ నే కారణం. అలాగే శివానీ, శివాత్మిక గార్లితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా కోసం కంటిన్యూస్ గా 48 గంటలు పాటు షూట్ చేసిన రోజుల కూడా ఉన్నాయి. ఆ సమయంలో వాళ్ళు చూపించిన కేర్ మర్చిపోలేము. రాత్రి 2, 3 గంటలకు కూడా తిండిపెట్టి చంపేశారు. అని అన్నారు.

ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది.దాంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి గరుడవేగ చిత్రం లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి

తాజా వార్తలు