నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున మరో సీనియర్ హీరో డా రాజశేఖర్ తన కొత్త చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది.
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రాజశేఖర్ ఆయనకు జన్మ దిన శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా తన సినిమా ప్రీ లుక్ ను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. గరుడవేగ సినిమా తర్వాత రాజశేఖర్ నటిస్తుండటం, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 26న మిగిలిన నటీనటులతో ఈ చిత్ర సాంకేతిక నిపుణులను కూడా వెల్లడించనున్నారు.


