ప్రశాంత్ నీల్ నుంచి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఫిక్సేనట.!

Published on Apr 2, 2021 5:09 pm IST

కన్నడ స్టార్ దర్శకుడు తన “కేజీయఫ్” ఒక్క సినిమాతో ఒక్క దక్షిణాదిలోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమాలోనే మంచి హాట్ టాపిక్ అయ్యిపోయాడు. దీనితో అక్కడ నుంచి చాప్టర్ 2, దాని టీజర్ కూడా చూసాక ఇక పాన్ ఇండియన్ డైరెక్టర్ గా నీల్ ను ప్రతీ ఒక్కరూ ఫిక్స్ అయ్యిపోయారు. మరి దీనికి తగ్గట్టుగా తాను సెట్ చేసుకున్న లైనప్ కూడా ఓ రేంజ్ లో ఉంది.

మరి ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో “సలార్” అనౌన్స్ చేసి సెన్సేషన్ ను పుట్టించిన నీల్ ఇటీవలే ఇళయ థలపతి విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడన్న టాక్ వచ్చింది. మరి ఇప్పుడు అది మరింత బలపడుతుంది. ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా ఫిక్సయ్యినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అంతే కాకుండా ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే ఉండనుంది అని తెలుస్తుంది. విజయ్ సినిమాలకు ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా చెయ్యకుండానే 250 కోట్లకు పైగా మార్కెట్ ఉంది. మరి ఇప్పుడు నీల్ కూడా కలుస్తుండడంతో ఈ కాంబో డెఫినెట్ గా మరిన్ని సాలిడ్ ఫిగర్స్ ను సెట్ చెయ్యడం కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇక ఫైనల్ గా ఈ కాంబోపై అధికారిక ప్రకటన ఒకటే రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :