ఇంతకీ మహేష్ బాబుతోనా.. ఎన్టీఆర్‌తోనా ?

Published on Sep 11, 2019 9:51 pm IST

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల మధ్య నడుస్తున్న ఆసక్తికర అంశాల్లో ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనా.. ఎన్టీఆర్‌తోనా అని. మొదట్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేస్తారని, ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. దాదాపు అవే కన్ఫర్మ్ అని అనుకున్నారంతా.

కానీ మూడు రోజుల నుండి మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా అని కొత్త చర్చ మొదలైంది. ప్రశాంత్ హైదరాబాద్ వచ్చి మహేష్ బాబుని మీట్ అయ్యారని, అవి సినిమా చర్చలేనని వార్తలొచ్చాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కలవరం మొదలైంది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాదోపవాదనలకు దిగుతున్నారు. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ పూర్తై ప్రశాంత్ తెలుగు సినిమా మొదలుపెట్టేనాటికి వచ్చే యేడాది ఆఖరు అవుతుంది కాబట్టి ఈలోపు స్వయంగా ప్రశాంత్ నీల్
సినిమా ఎవరితో అని క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

సంబంధిత సమాచారం :

X
More