ఫస్ట్ లుక్ లోనే క్లైమాక్స్ ట్విస్ట్ చెవుతాడట.

Published on May 27, 2020 7:56 pm IST

దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్విటర్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆయన తన మూడవ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు చెప్పుకొస్తున్నారు. అలాగే తన గత రెండు చిత్రాల్లోని ఫస్ట్ లుక్‌లోనే సినిమా కాన్సెప్ట్ ఏంటని ఓ హింట్ ఇచ్చాను అని, మూడో ప్రాజెక్ట్‌కు సంబంధించిన హింట్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ఎంతో ఆత్రుతగా ఉన్నానని ట్వీట్ చేశాడు. కాగా మరి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో రానున్నాయి.

మొదటి చిత్రంగా కాజల్ ప్రధాన పాత్రలో సైకలాజికల్ థ్రిల్లర్ అ మూవీ చేశాడు. ఈ మూవీకి నిర్మాత హీరో నాని కాగా బెస్ట్ మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలలో జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇక గత ఏడాది రాజశేఖర్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ కల్కి తెరకెక్కించాడు. కాన్సెప్ట్ పరంగా ఒకే అనిపించిన ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా ఆడలేదు. గతంలో అ మూవీకి సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచాను అని చెప్పిన ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ ఏమిటో చూడాలి.

సంబంధిత సమాచారం :

More