‘కల్కి’ కి సీక్వెల్ చేసే ఆలోచనలో ప్రశాంత్ వర్మ

Published on Jun 26, 2019 1:00 am IST

ఈ శుక్రవారం విడుదలకానున్న సినిమాల్లో ‘కల్కి’ ఒకటి. ‘గరుడవేగ’ తర్వాత రాజశేఖర్ చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అదీకాక ఈరోజు విడుదలైన హానెస్ట్ ట్రైలర్ సినిమా కథేమిటనేది రివీల్ చేస్తూనే సినిమాను చూడాలనే ఆసక్తిని క్రియేట్ చేసింది. బజ్ బాగా ఉండటంతో ఓపెనింగ్స్ మంచి స్థాయిలోనే ఉండే అవకాశముంది.

భారీ బడ్జెట్ కేటాయించి చేసిన ఈ సినిమా హిట్టవ్వాలంటే మంచి కలెక్షన్స్ రావాల్సిందేనని దర్శకుడు ప్రశాంత్ వర్మ అంటున్నారు. 1983 నేపథ్యంలో సాగే ఈ కథలో హీరో పాత్ర ‘కల్కి’ చాలా బాగుంటుందని, ఆ పాత్ర ద్వారా ప్రాంచైజీ మాదిరి ఇంకొన్ని సినిమాలు చేయవచ్చని, చిత్రం చూశాక ‘కల్కి 2’ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తారని అన్నారు. ప్రశాంత్ వర్మ ఇలా ప్రాంచైజీ, సీక్వెల్ అంటూ సినిమా కొనసాగింపు గురించి ఆసక్తిగా మాట్లాడటం చూస్తుంటే ఆయన మనసులో సీక్వెల్ తీయాలనే కోరిక బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి అది వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More