దర్బార్ లో విలన్ గా యంగ్ బాలీవుడ్ యాక్టర్ !

Published on Apr 17, 2019 1:04 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్బార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఇటీవలే ముంబై లో ప్రారంభమైంది. ఏ ఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటించనునున్నాడు. కాగా మురగదాస్ తన సినిమాల్లో బాలీవుడ్ నటులను విలన్ గా తీసుకోవడం ఇది మూడవ సారి. ఇంతకుముందు విద్యుత్ జమ్మవాల్ ను తుపాకి లో విలన్ గా తీసుకోగా నిల్ నితిన్ ముఖేష్ ,కత్తి లో విలన్ గా నటించారు.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :