మెగాహీరో సాయి తేజ్ తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మండమైన వసూళ్లను రాబడుతోంది. వీకెండ్ రోజుల్లోనే కాకుండా సోమ, మంగళవారాల్లో కూడా పూర్తి ఆధిక్యం కనబర్చిన ఈ చిత్రం నిన్న క్రిస్మస్ సెలవు కావడంతో మరింత పుంజుకుంది. దాదాపు ఒకటి, రెండవ రోజుల్లో చేసినంత వసూళ్లను రాబట్టుకుంది.
ముఖ్యంగా నైజాం ఏరియాలో అత్యధిక వసూళ్లను ఖాతాలో వేసుకుంది. మొదటి 5 రోజుల్లో రూ.5.38 కోట్ల షేర్ వసూలు చేసి నిన్న 6వ రోజు రూ. 1.15 కోట్లు కలెకట్ చేసింది. దీంతో నైజాం షేర్ రూ.6.52 కోట్లకు చేరుకుంది. సాయి తేజ్, మారుతిల కెరీర్లో ఇవే అత్యుత్తమ వసూళ్లుగా నమోదయ్యాయి. ఇక ఈ వారం కూడా పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ‘ప్రతిరోజూ పండగే’ స్టడీ రన్ కనబర్చే వీలుంది.
