విజయోత్సవ వేడుకకు సిద్దమైన ‘ప్రతిరోజూ పండగే’ టీమ్

PratiRoju

సాయి తేజ్, రాశీ ఖన్నాలు జంటగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.10.5 కోట్ల వరకు షేర్ రాబట్టిన ఈ సినిమా ఐదవ రోజు కూడా అదే జోరు కొనసాగించింది. కొన్ని ఏరియాల్లో నాల్గవ రోజు కంటే ఐదవ రోజు ఎక్కువ కలెక్ట్ చేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో రూ.82 లక్షలు అందుకుంది.

అలాగే సీడెడ్, ఈస్ట్, వెస్ట్, క్రిష్ణ, నెల్లూర్ ప్రాంతాల్లో కూడా ఐదవ రోజు వసూళ్లు నాల్గవ రోజు కంటే ఎక్కువే ఉన్నాయి. ట్రెడ్ లెక్కల మేరకు 5 రోజులకు కలిపి రూ.12.5 కోట్ల షేర్ అందుకుంది. దీంతో టీమ్ భారీ విజయం ఖాయమని సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో విజయోత్సవ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు చిత్ర టీమ్ మొత్తం హాజరుకానుంది.

Exit mobile version