ప్రీ లుక్ పోస్టర్ తో ఆసక్తి రేపుతున్న నాగ్ నెక్స్ట్.!

Published on Aug 27, 2021 9:15 am IST


ప్రస్తుతం కింగ్ నాగార్జున హీరోగా పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వీటిలో టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఒక మాస్ అనౌన్సమెంట్ మరియు ప్రీ లుక్ పోస్టర్ బయటకి వచ్చింది.

ఇది చూస్తే ఊహించని విధంగా చాలా ఆసక్తిని రేపుతోంది అని చెప్పాలి. వర్షంలో కత్తిని పట్టుకొని ఉన్న నాగ్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నట్టు అర్ధం అవుతుంది అంతే కాకుండా దీనిని కూడా హాలీవుడ్ లెవెల్ ప్రమాణాలతో అత్యున్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టుగా అర్ధం అవుతుంది..

అలాగే ఇందులోనే వచ్చే 29వ తారీఖున మరో సాలిడ్ అప్డేట్ ఉండనున్నట్టుగా తెలుపుతున్నారు. మొత్తానికి మాత్రం ఈ చిత్రం మంచి ప్రామిసింగ్ గా ఉండేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నాగ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు కలిపి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :