‘గరుడవేగ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారుకు రామ్ పూర్తి కథ వినకుండానే అవకాశం ఇచ్చాడు. స్రవంతీ మూవీస్ లో ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. కానీ స్క్రిప్ట్ మొత్తం విన్నాక బడ్జెట్ ఎక్కువయిందని స్రవంతి మూవీస్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో రామ్ హీరోగా రావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. ప్రవీణ్ సత్తారు ఇప్పుడు ఈ కథను ధనుష్‌తో చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. ధనుష్ కైతే తెలుగు, తమిళ రెండు భాషల్లో మార్కెట్ ఉంది. బడ్జెట్ కాస్త ఎక్కువైనా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. అందుకే ప్రవీణ్ ధనుష్ కు కథ చెప్పడానికి అప్పాయింట్మెంట్ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది.
ప్రవీణ్ సత్తారు చెప్పబోయే ఈ కథ ధనుష్ కు నచ్చితే.. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో హీరోతో పాటు సమానంగా ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. రామ్ హీరోగా ఉన్నప్పుడు ఆ పాత్రను హీరో రాజశేఖర్ చేయనున్నారు అన్నారు. మరి ఇప్పుడు ఈ కథకు హీరోగా ధనుష్ వస్తే, ఆ పాత్రలో ఎవర్ని తీసుకుంటారో..!


