‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్లే !

Published on Jun 26, 2019 6:14 pm IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’ జూన్ 28న రిలీజ్ అవుతుంది. అయితే చిత్రబృందం ఈ రోజు సాయంత్రం ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ ఈవెంట్ చివరి నిముషంలో రద్దు అయింది. కారణం రాజశేఖర్ నిన్న అస్వస్థతకు గురయ్యారట.

రాజశేఖర్ అనారోగ్యం కారణంగానే ఈ రోజు ప్రమోషన్స్ ను కూడా చిత్రబృందం రద్దు చేసుకుంది. మొత్తానికి వైవిధ్యమైన కథతో యాక్షన్ ఎంటర్టైనెర్ గా రాబోతున్న కల్కి సినిమాలో నందిత శ్వేతా, ఆదా శర్మ, రాహుల్ రామకృష్ణ, పూజిత పొన్నాడ, నాజర్, సిద్ధూ, జొన్నలగడ్డ, శత్రు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More