సమీక్ష : “ప్రేమ్ కుమార్” – ఇంట్రస్ట్ గా సాగని కామెడీ డ్రామా !

సమీక్ష : “ప్రేమ్ కుమార్” – ఇంట్రస్ట్ గా సాగని కామెడీ డ్రామా !

Published on Aug 19, 2023 2:55 AM IST
Pizza3 Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 18, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు

దర్శకుడు : అభిషేక్ మహర్షి

నిర్మాత: శివప్రసాద్ పన్నీరు

సంగీతం: ఎస్. అనంత్ శ్రీకర్

సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగం

ఎడిటర్: గ్యారీ బి హెచ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘ప్రేమ్ కుమార్’. ఇందులో సంతోష్ శోభన్ కథానాయకుడు. రాశి సింగ్, రుచితా సాధినేని హీరోయిన్లు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్), నేత్ర (రాశి సింగ్) పెళ్లి జరుగుతూ ఉండగా.. రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వచ్చి పెళ్లి ఆపేస్తాడు. తానూ, నేత్ర ప్రేమించుకున్నామని… ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కూడా ప్రేమ్ కుమార్ పెళ్లిళ్లు ఆగిపోతూ ఉంటాయి. అయినా, ప్రేమ్ కుమార్ మరో పెళ్లికి రెడీ అవ్వడం, అదీ క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మొత్తానికి పెళ్లి కావడం లేదని ఫ్రస్ట్రేషన్‌ లో ప్రేమ్ కుమార్ ఏం చేశాడు ?, తన స్నేహితుడు సుందర్ లింగం (కృష్ణ తేజ)తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ ఎలా పెట్టాడు ?, ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ? చివరకు ప్రేమ్ కుమార్ – నేత్ర ఒకటవుతారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో సంతోష్ శోభన్ పోషించిన ప్రధాన పాత్ర అయిన ప్రేమ్ కుమార్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన పెళ్లి ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు సిల్లీ కామెడీ సీన్స్.. ఇలా మొత్తానికి ప్రేమ్ కుమార్ సినిమా కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు.

అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సంతోష్ శోభన్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. అలాగే, కీలక పాత్రలో నటించిన రాశి సింగ్ కూడా చాలా బాగా నటించింది. రుచితా సాధినేని కూడా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్యలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు అభిషేక్ మహర్షి మంచి ఫన్ వర్కౌట్ అయ్యే స్టోరీ లైన్ తీసుకున్నా.. దాన్ని ఇంట్రెస్టింగ్ ప్లే తో ఆసక్తికరంగా సినిమాని మలచలేక పోయారు. సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సిల్లీ ట్రాక్స్ తో బోరింగ్ క్యారెక్టర్స్ తో సినిమాని బోర్ కొట్టించారు. అసలు సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ కూడా సరిగ్గా కనెక్ట్ కావు. దీనికి తోడు ప్రేమ్ కుమార్ క్యారెక్టర్ ట్రాక్ కూడా చాలా ఇల్లాజికల్ గా ఉంది.

దీనికి తోడు చాలా సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అయింది. అలాగే కామెడీ కోసం కథను పూర్తి సినిమాటిక్ టోన్ లో నడిపాడు దర్శకుడు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. కొంచెం అయినా బెటర్ గా ఉండేది. సరే.. సినిమాలో లవ్ లేకపోతే పోయింది.. హీరో హీరోయిన్లు కొన్ని సీన్స్ లో అయితే మరీ సిల్లీగా బిహేవ్ చేస్తోన్న ఫీలింగ్ కలుగుతుంది.

మొత్తానికి ఈ ప్రేమ్ కుమార్ సినిమా కథ కథనాలు మరీ స్లోగా సాగడం అస్సలు బాగాలేదు. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. మొత్తానికి ఈ రెగ్యులర్ సిల్లీ బోరింగ్ కామెడీ డ్రామా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు అభిషేక్ మహర్షి ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించ లేకపోయాడు.

 

సాంకేతిక విభాగం :

 

పైన చెప్పుకున్నట్లు దర్శకుడు అభిషేక్ మహర్షి తాను రాసుకున్న కథను స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. అతను కథ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. సంగీతం ఆకట్టుకునేలా ఉంది. అయితే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టు ఉంటే బాగుండేది. ఇక ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

 

‘ప్రేమ్ కుమార్’ అంటూ వచ్చిన ఈ సిల్లీ కామెడీ డ్రామా ఆకట్టుకోలేకపోయింది. సిల్లీ ట్రాక్స్, ఫేక్ ఎమోషన్స్ అండ్ బోరింగ్ ప్లే మరియు పూర్తి సినిమాటిక్ టోన్ వంటి అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. సంతోష్ శోభన్ నటన, కొన్ని కామెడీ సీన్స్ తప్ప, అంతకు మించి ఈ చిత్రంలో కంటెంట్ లేదు. మొత్తమ్మీద ఈ సినిమా నిరుత్సాహపరుస్తుంది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు