తమిళంలో ‘డార్లింగ్’ పేరుతో ‘ప్రేమ కథా చిత్రమ్’ రీమేక్.

తమిళంలో ‘డార్లింగ్’ పేరుతో ‘ప్రేమ కథా చిత్రమ్’ రీమేక్.

Published on Sep 26, 2014 10:15 AM IST

darling
ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా తమిళంలో ‘ప్రేమ కథా చిత్రమ్’ను రీమేక్ చేస్తున్నారు టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్. హీరోగా అతనికిది తొలి సినిమా. ‘డార్లింగ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ నేడు విడుదల చేశారు. స్టూడియో గ్రీన్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శామ్ అంటోని దర్శకుడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

సుధీర్ బాబు, నందిత జంటగా మారుతి దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ సినిమా ‘ప్రేమ కథా చిత్రమ్’ తెలుగులో ఘన విజయం సాదించింది. కొత్త ట్రెండ్ కూడా క్రియేట్ చేసింది. వరుసగా మిగతా దర్శకనిర్మాతలు, హీరోలు ఈ హారర్ కామెడీ సినిమాల ట్రెండ్ ఫాలో అయిపోయి విజయాలు సొంతం చేసుకున్నారు. మరి తమిళంలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో..?

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’, ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలతో సంగీత దర్శకుడిగా జివి ప్రకాష్ కుమార్ తెలుగులో మంచి పేరు తెచుకున్నారు.

తాజా వార్తలు