అభిలాష్ వాడాడ , ప్రియా వడ్లమాని , మౌనిక హీరో హీరోయిన్లు గా నూతన దర్శకుడు ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ప్రేమకు రెయిన్ చెక్. నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రై లర్ కి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దీపక్ కిరణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 23న ప్రేక్షకులముందుకు రానుంది.
‘సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు , గోపాల గోపాల’ చిత్రాలను నిర్మించిన నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.


