‘ప్రేమకు రెయిన్ చెక్’ విడుదల తేదీ ఖరారు !
Published on Aug 22, 2018 11:46 am IST

అభిలాష్ వాడాడ , ప్రియా వడ్లమాని , మౌనిక హీరో హీరోయిన్లు గా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ప్రేమకు రెయిన్ చెక్. టైటిల్ తోనే చిత్రంపై ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్ర బృందం ఈ కాలానికి, ప్రస్తుత యువత (మిల్లెనిఅల్స్) ని దృష్టి లో ఉంచి కథ చెప్పే ప్రయత్నం చేసామని, కథ గురించి తెలుపుతూ ఈ చిత్రం లో ఒక వ్యక్తి తన ప్రేమకు రెయిన్ చెక్ ఇచ్చి కెరీర్ కి ప్రాముఖ్యత ఇవ్వాలని తన జీవితాని ఎలా కాంప్లికేట్ చెశాడు అనే కాన్సెప్ట్తో తెరకెక్కింది.
దీపక్ కిరణ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల కావాల్సి వుంది కానీ అనివార్యకారణాలవల్ల వాయిదా పడింది. స్టోన్ మీడియా తాజాగా ఈచిత్రాన్ని సెప్టెంబర్ 7న ప్రేక్షకులముందుకు తీసుకురానుంది.

‘సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు , గోపాల గోపాల’ చిత్రాలను నిర్మించిన నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమన్, రఘు కారుమంచి, కిరీటి దామరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook