తెలుగులో బాగా గుర్తింపు ఉన్న అజయ్ ప్రధాన ప్రాత్రలో క్రాంతి, రిషి, రూబీ పరిహార్, శ్రీ ఐరా హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘ప్రేమలో ABC’. గత కొద్ది రోజులుగా రిలీజ్ కోసం మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న ఈ చిత్ర టీం ఫైనల్ గా జూలై 25న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అజయ్, రిషి పెర్ఫార్మన్స్ హైలైట్ గా ఇంటిల్లిపాది చూడదగిన సినిమా అని ఈ చిత్ర టీం చెబుతోంది.
ఇటీవలే విడుదలైన పాటలకి మంచి రెస్పాన్స్ రావడంతో పాటల విజయోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించారు. తలారి నాగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జెవి రెడ్డి నిర్మాత. బైగల్ల సంగీతం అందించిన ఈ సినిమాలో ఎంఎం కీరవాణి ఓ పాత పాడడం విశేషం. ఒక అమ్మాయి ముగ్గురు అమ్మయిలతో సాగించే ప్రేమాయణాన్ని ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు.


