‘ప్రేమమ్’ దర్శకుడి మనసులో రజినీకాంత్

Published on May 18, 2021 11:47 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయాలనేది ప్రతి ఒక్క దర్శకుడి కల. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ రజినీని డైరెక్ట్ చేయాలని ఆశపడుతుంటారు. తమిళంలోనే కాదు ఇతర భాషల్లోనూ అలాంటి దర్శకులు చాలామంది ఉన్నారు. వారిలో మలయాళం దర్శకుడు అల్ఫోన్సే పుత్రేన్ కూడ ఒకరు. ‘ప్రేమమ్’తో బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నాడు అల్ఫోన్సే. దక్షిణాది ప్రేక్షకులంతా ఆ సినిమాను విపరీతంగా మెచ్చారు. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు ఫహాద్ ఫాజిల్, నయనతరాలతో ఒక చిత్రం చేస్తున్నారు.

అయితే ‘ప్రేమమ్’ హిట్ అయిన వెంటనే అల్ఫోన్సే పుత్రేన్ రజినీకాంత్ తో సినిమా చేయాలని అనుకున్నారట. అనుకోవడమే కాదు రజనీకి సరిపడా కథను కూడ రెడీ చేసుకుని రజినీని కలిసే ప్రయత్నం చేశారట. కానీ కలవలేకపోయారట. కనీసం ఆయనకు కథ చెప్పే అవకాశం కూడ దొరకలేదట. అయినా అల్ఫోన్సే పుత్రేన్ డీలా పడట్లేదు. రజినీ కోసం రాసిన కథను రజినీకే చెబుతానని, ఆ ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నానని, దేవుడి దయ ఉంటే రజినీని డైరెక్ట్ చేయాలనే తన కొరిక తీరుతుందని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :