మిలియన్ మార్క్ ను క్రాస్ చేసిన ‘ప్రేమమ్’ ట్రైలర్

Premam-m
మళయాళ సూపర్ హిట్ చిత్రం ‘ప్రేమమ్’ కు రీమేక్ గా వస్తున్న తెలుగు ‘ప్రేమమ్’ చిత్రం అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకుంటోంది. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో ఈ నెల 20వ తేదీన జరిగింది. అదేరోజున ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో నాగ చైతన్య నటన, ముగ్గురు హీరోయిన్లతో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవడంతో ట్రేలర్ కు మంచి స్పందన లభించింది.

ఇప్పటికే ఇది మిలియన్ మార్కును దాటిపోయింది. ఇప్పటి వరకూ సుమారు 1,146,276 మంది ఈ ట్రైలర్ ను వీక్షించారు. అలాగే ఆడియోకు కూడా బ్రహ్మాండమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. సినీ వర్గాల్లో సైతం సినిమా పట్ల మంచి పాజిటివ్ అభిప్రాయం ఉండటంతో సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధించేలా కనిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్, రాజేశ్ మురుగేశన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల చేయనున్నారు. ఇందులో చైతు సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు.