‘ప్రేమిక’ మూవీ ప్రెస్‌మీట్ విశేషాలు

‘ప్రేమిక’ మూవీ ప్రెస్‌మీట్ విశేషాలు

Published on Aug 19, 2015 5:52 PM IST

Premak
మౌంటెన్ మూవీస్ పతాకంపై శంకర్, వెంకట కృష్ణ, లక్ష్మయ్య నిర్మాతలుగా రూపొందిస్తోన్న సినిమా ‘ప్రేమిక’. ఈ సినిమా ద్వారా మహీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ఈ సందర్భంగా సినిమా విశేషాలు తెలియజేస్తూ దర్శక, నిర్మాతలు హైద్రాబాద్‌లో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దర్శక, నిర్మాతలతో పాటు సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్న సీనియర్ నటులు కవిత, శివ పార్వతి, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ సమావేశంలో దర్శకుడు మహేంద్ర మాట్లాడుతూ.. భద్రాచలంలో జరిగిన నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు, మూడు ప్రేమ జంటల మధ్య జరిగే కథగా ఈ సినిమా నడుస్తుందని తెలియజేశారు. ఇక వచ్చే నెల ఐదు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని దర్శకుడు ఈ సందర్భంగా తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చామని, తప్పకుండా అందరినీ ఆకట్టుకునే సినిమాగా ఈ సినిమా రూపొందనుందని నిర్మాతలు తెలిపారు. మహీంద్ర, పవన్, శౌర్య, లిషిత, జనని, మౌనిక తదితరులు ఈ సినిమా ద్వారా ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. రాహుల్ మాచినేని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, దిలీప్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు