దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ వచ్చే వారం బుధవారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో తీయనున్న యాక్షన్ సీన్స్ కోసం ఓ భారీ సెట్ కూడా వేశారట. ఈ సెట్ లో శర్వా పైనే షూట్ చేస్తారట. అన్నట్టు ఈ ప్రాజెక్టుకు సంబంధించి శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి.
కాగా భాగ్యశ్రీ బోర్సే ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండో షెడ్యూల్ లో జరగబోయే షూట్ లో హీరో – హీరోయిన్ల పై లవ్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నాడు.
