గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర భారీ సక్సెస్ అందుకున్న చిత్రాల్లో కన్నడ సినిమా నుంచి వచ్చిన చిత్రం ‘కాంతారా చాప్టర్ 1′(Kantara Chapter 1) కూడా ఒకటి. దర్శకుడు అలాగే నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించి నటించిన చిత్రం కాంతార చాప్టర్ 1 కూడా ఒకటి. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా 800 కోట్లకి పైగా రాబట్టింది.
ఇక ఈ సినిమాని కొన్నాళ్ల కితమే మేకర్స్ స్వయంగా ఆస్కార్ నామినేషన్ కి పంపుతున్నట్టుగా టాక్ వినిపించింది. ఇలా పంపిన ఈ సినిమా విషయంలో ఒక గుడ్ అండ్ ప్రైడ్ మూమెంట్ లాంటి న్యూస్ ని మేకర్స్ అందించారు. ఈసారి జరగనున్న అకాడమీ అవార్డ్స్ లో చోటు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఉత్తమ చిత్రం జాబితాలో ఎంపిక అయినట్టు మేకర్స్ చెబుతున్నారు. అంతే కాకుండా ఇదే హోంబళే ఫిల్మ్స్ నుంచి మహావతార్ నరసింహా కూడా వెళ్లినట్టు కూడా తెలిపారు. దీనితో ఈ న్యూస్ కన్నడ అభిమానులలో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఆడియెన్స్ లో ఎంతో గర్వకారణంగా నిలిచింది.
Rooted in our culture, driven by divinity.
Proud and privileged as #KantaraChapter1 enters the Best Picture contending race at the #Oscars Academy Awards 2026.#KantaraForOscars#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets… pic.twitter.com/ZDcAP1GSVw— Kantara – A Legend (@KantaraFilm) January 9, 2026


