గాన గంధర్వునికి ప్రధాని అశ్రు నివాళి.!

Published on Sep 25, 2020 3:03 pm IST

సంగీత విశ్వంలోనే ఈరోజు మర్చిపోలేని రోజు. భారతీయ సంగీత లోకంలో మకుటం లేని మహారాజు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారి మరణ వార్త విని సంగీతమే మూగబోయిన రోజుది. గత కొన్ని వారాల నుంచి ఆయన కోవిడ్ తో బాధ పడుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు తుది శ్వాస విడిచి స్వర్గస్థులు అయ్యారు. ఈ చేదు వార్త బయటకు రావడంతో యావత్తు భారతావళి శోక సంద్రంలో మునిగిపోయింది.

ఇప్పటికే ఈ వార్త విని అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు అంతా నివాళులు అర్పిస్తున్నారు. అలా ఇపుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా బాలు గారి అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. “బాలు గారి అకాల మరణం మన దేశపు సాంప్రదాయానికే తీరని లోటు, దశాబ్దాల పాటుగా ఆయన మధురమైన స్వరం మంత్రముగ్ధులను చేసింది. ఈ గంట పాటు నా ఆలోచనలు అన్నీ ఆయన కుటుంబం ఆయనతో పాటే ఉన్నాయని” మోడీ ఆ మహనీయునికి అశ్రు నివాళి అర్పించారు.

సంబంధిత సమాచారం :

More