26/11 సెన్సేషన్ “ముంబై డైరీస్” సీజన్ 2 కి డేట్ ఫిక్స్.!

Published on Sep 27, 2023 11:23 am IST

ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చి సూపర్ హిట్ అయినటువంటి పలు సిరీస్ లలో ఇండియన్ హిస్టరీలో అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటైన 26/11 ముంబై దాడులు నేపథ్యంలో చేసిన ఇంట్రెస్టింగ్ సిరీస్ “ముంబై డైరీస్” కూడా ఒకటి. దర్శకుడు నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో మంచి ఆదరణను దక్కించుకుంది.

అయితే 26/11 అంటే భారతదేశం తరపున పోరాడి ప్రాణాలు అర్పించిన సమరయోధులు మాత్రమే కాకుండా ఆ దాడులలో ఆకస్మికంగా అంతకు మించిన సేవలను అందించిన వైద్యుల కోసం తెరకెక్కించిన ఈ సిరీస్ సాలిడ్ ఎమోషన్స్ తో సాగుతుంది. మరి దీనికి కొనసాగింపు సీక్వెల్ సీజన్ ని విషయంలో అయితే మేకర్స్ ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారు.

ఈ అవైటెడ్ సిరీస్ ఈ అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టుగా లాక్ చేశారు. అయితే ఇప్పుడు దీనిపై రివీల్ చేసిన టీజర్ తో ఈసారి కొత్త నేపథ్యాన్ని మరో డిజాస్టర్ ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కొత్త సీజన్ అయితే ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :