రీసెంట్ హిట్ ఓటీటీ సిరీస్ సీక్వెల్ ని పక్కన పెట్టేసిన ప్రైమ్ వీడియో! కారణమిదే

Spider Noir

వరల్డ్ వైడ్ పాపులర్ ఓటీటీ సంస్థల్లో ప్రైమ్ వీడియో కోసం కూడా చాలా మందికి తెలుసు. అయితే వీరి నుంచి ఇటీవల వచ్చిన పాపులర్ సిరీస్ నే ‘స్పైడర్ నోయిర్’. మార్వెల్ ఫ్యాన్స్, స్పైడర్ మ్యాన్ అభిమానులని ఎంతగానో అలరించిన ఈ సిరీస్ లో ఘోస్ట్ రైడర్ నటుడు నికోలస్ కేజ్ ప్రధాన పాత్రలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో దీన్ని ప్లాన్ చేశారు.

ఒకేసారి బ్లాక్ అండ్ వైట్, కలర్ రెండు వెర్షన్ లలో ఈ సిరీస్ ని ప్రైమ్ వీడియో వారు విడుదల చేసారు. ఇలా మంచి హైప్ నడుమ తీసుకొచ్చారు. టాక్ కూడా బాగానే వచ్చింది కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సీజన్ 2 డీల్ ని క్యాన్సిల్ చేసేసినట్టు హాలీవుడ్ రిపోర్స్ట్ చెబుతున్నాయి. అయితే దీనికి కారణం కూడా తెలుస్తోంది.

స్పైడర్ నోయిర్ సీజన్ 2 ఇందుకే నిలిపివేత

సీజన్ 1 కి వీక్షకుల విమర్శకుల నుంచి మంచి స్పందన అందుకున్నప్పటికీ వ్యూస్ పరంగా ప్రైమ్ వీడియో వారు అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ని స్పైడర్ నోయిర్ అందుకోవడంలో విఫలం అయినట్టు తెలుస్తోంది. సో ఈ లెక్కల ప్రకారమే సీజన్ 2 తాము బడ్జెట్ పెట్టి చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు అని సీజన్ 2 నిర్మాణాన్ని నిలిపేసినట్టు తెలుస్తోంది. ఇది మాత్రం స్పైడర్ ఫ్యాన్స్ కి డిజప్పాయింట్ చేసే న్యూస్ అనే చెప్పాలి.

Exit mobile version